మానవ సంబంధాలు | - | Sakshi
Sakshi News home page

మానవ సంబంధాలు

Jul 10 2026 9:45 AM | Updated on Jul 10 2026 9:45 AM

వికారాబాద్‌: అవలీలగా హత్యలు చేస్తున్నారు.. ప్రతి హత్యను పోలీసులు ఛేదిస్తున్నా ఘోరాలు మాత్రం ఆగడంలేదు.. వివాహేతర సంబంధాలు, ఆస్తి గొడలతో హత్యలకు తెగబడుతున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన రాజేష్‌, నవీన దంపతులు 17 ఏళ్ల క్రితం వికారాబాద్‌కు వలస వచ్చారు. రాజీవ్‌ గృహకల్ప కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసముంటున్నారు. దంపతులిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఆ తర్వాత కిరాణా వ్యాపారం ప్రారంభించారు. మద్యానికి బానిసైన రాజేష్‌ భార్యను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు. బాధలు భరించలేని నవీన 2013లో ఓ సారి భర్తను హత్య చేసేందుకు యత్నించి విఫలమైంది. భర్తతో పరిచయం ఉన్న శ్రీనివాస్‌ తరచూ ఇంటికి వచ్చి మద్యం తాగేవాడు. అతనికి దగ్గరైంది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో తన 16 ఏళ్ల కుమారిడితో కలిసి కట్టుకున్న వాడిని కడతేర్చాలని శ్రీనివాస్‌ను ప్రోత్సహించింది. రాజేష్‌ తనకు అడ్డుగా ఉన్నాడని భావించిన శ్రీనివాస్‌ మూడు నెలల క్రితం మద్యం తాగుదామని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. మద్యంలో కలుపుకొనేందుకు నీళ్లు కావాలని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి, వెనుక నుంచి తోసేశాడు. నెల రోజుల క్రితం రాజేష్‌ అన్న కుమారుడు బాబాయ్‌ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదైంది. కాల్‌ డేటా ఆధారంగా శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. ఇదిలా ఉండగా నవీన వారం రోజుల క్రితం పాపకు జన్మనిచ్చింది. ఆస్పత్రి వద్ద కాపలా ఉంచిన పోలీసులు రెండు రోజుల క్రితం ఆమెను రిమాండ్‌కు తరలించారు. ప్రియుడు ఓ జైలులో నవీన మరో జైలులో ఉండగా కుమారుడిని జువైనెల్‌ హోమ్‌కు పంపించారు.

జిల్లాలో ఇటీవల కాలంలో

జరిగిన కొన్ని ఘటనలు

● వికారాబాద్‌ మండలం కామారెడ్డి గూడకు చెందిన ఓ యువకుడు వృత్తిరీత్యా డ్రైవర్‌. ఏడాది క్రితం గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌ బోడుప్పల్‌లో నివాసం ఉండేవాడు. ఆరు నెలలు కాపురం సవ్యంగా సాగింది. ఆ తర్వాత వరకట్నపు వేధింపులకు పాల్పడుతూ వచ్చాడు. గర్భం దాల్చిన భార్యను కడతేర్చి ముక్కలుగా నరికాడు. మొండెం నుంచి తల, శరీర భాగాలను వేరు చేసి మూసిలో పడేశాడు. ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. యువతి తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది.

● తాండూరు మండలం మల్కాపూర్‌లో భార్య భర్తను కడతేర్చింది. తప్పు అని చెప్పాల్సిన తండ్రి కూతురికి సహకరించాడు. ఇద్దరూ కటకటాల పాలయ్యారు. దీంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.

● బంట్వారం మండలం కొంపల్లికి చెందిన దంపతులు మోమిన్‌పేట మండలం కేసారం గ్రామ శివారులోని ఓ ప్రైవేట్‌ వెంచర్‌లో కూలి పనులు చేసుకుంటూ అక్కడే ఉండేవారు. ఆరు నెలల క్రితం భర్తతో గొడవపడింది. భర్త నిద్రిస్తున్న సమయంలో బండరాయితో తలపై మోది హతమార్చింది.

● కోట్‌పల్లి మండలం రాంపూర్‌కు చెందిన ఓ మహిళ భర్తతో తరచూ గొడవ పడేది. వేరే గ్రామానికి వెళ్దామని పట్టుపట్టేది. భర్త ససేమిరా అనడంతో రాత్రి పడుకున్నాక బండరాయితో తలపై మోది అంతమొందించింది. తండ్రి చనిపోగా తల్లి జెలుకెళ్లడంతో ఇద్దరు కూతుళ్లు అనాథలయ్యారు.

వివాహేతర సంబంధాలు, ఆస్తి గొడలతో హత్యలు

ఛిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు

తాజాగా భర్తను హత్య చేసిన కేసులో భార్యకు రిమాండ్‌

కుమారుడిని జువైనెల్‌ హోమ్‌కు తరలింపు

ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement