రూ.600 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్లు | - | Sakshi
Sakshi News home page

రూ.600 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్లు

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

మర్పల్లి: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందకు తనవంతు కృషి చేస్తానని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌ రమేష్‌ తోకలిసి రత్నమ్మ, మంజుల, లక్ష్మి తోపాటు మరి కొందరి ఇళ్లను ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ నుంచి ప్రధాన రహదారి వరకు రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన 47మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రూ.600 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్లు నిర్మిస్తున్నుట్లు చెప్పారు. ఆరు నెలల్లో పనులు పూర్తవుతాయన్నారు. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రూ.50 లక్షల నుంచి రూ.కోటి వెచ్చించి సీసీ రోడ్లు వేస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్‌తోనే పేదల సొంతింటి కల సాకారం అవుతోందన్నారు. మండల పరిధిలోని ఘణాపూర్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ పురుషోత్తం, ఎంపీడీఓ శ్రీనివాస్‌, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్‌ కొండల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సురేష్‌, జిల్లా, మండల నాయకులు సుభాష్‌ యాదవ్‌, దివాకర, రవీందర్‌, నాగేశ్‌, రఫీ, రాచన్న, శేఖర్‌, రథన్‌, సర్వేష్‌, మధుకర్‌రెడ్డి, నిఖీల్‌రెడ్డి, జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

మండలంలోని కోట్‌మర్పల్లిలో మల్లన్న స్వామి ఆలయ పునర్నిర్మాణానికి స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, సర్పంచ్‌ మల్లారెడ్డి, సిరిపురం సహకార సంఘం మాజీ చైర్మన్‌ రఘుపతిరెడ్డి, మర్పల్లి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు రాచన్న, రామేశ్వర్‌, వెంకట్‌రాంరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు జైహింద్‌రెడ్డి, బిచ్చిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తోనే పేదల సొంతింటి కల సాకారం

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేద ప్రజలకు వరం

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement