కుల్కచర్ల: పిడుగుపాటుకు మూగజీవాలు మృతిచెందిన ఘటనలు చౌడాపూర్ మండల పరిధిలో చోటుచేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో పిడుగులు పడ్డాయి. బొర్రహేమ్యానాయక్‌తండాకు చెందిన ముడావత్ చందర్‌కు చెందిన ఓ గేదె, ఓ ఆవు పిడుగుపాటు గురై అక్కడికక్కడే చనిపోయాయి. వీటి విలువ రూ.లక్షన్నర వరకు ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక సర్పంచ్ లావుడ్య శ్రీనివాస్ ఘటనాస్థలాన్ని పరిశీలించి, బాధితులను ఓదార్చారు. మందిపల్‌కు చెందిన సంటి అంజయ్య పొలంలో పడిన పిడుగుతో అతని పాడి గేదె మృతిచెందింది. దీని విలువ రూ.70 వేలు ఉంటుందని బాధితుడు వాపోయాడు. అలాగే పుట్టపహాడ్‌కు చెందిన మిద్దె నిరంజన్ పొలంలో పిడుగు పడి, రూ.లక్ష విలువైన ఆవు మృత్యువాత పడింది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.


