యాలాల: విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నటు్‌ల్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని అగ్గనూరు, యాలాల, ముద్దాయిపేట గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అగ్గనూరులో రూ.42 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్, యాలాల మండల కేంద్రంలో రూ.7 లక్షలతో చేపట్టిన ప్రహరీ, రూ.20 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మౌలిక వసతుల కల్పనకు గాను కొత్త భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అగ్గనూరు పాఠశాలలో మరో 4 అదనపు గదులను మంజూరు చేయాలని స్థానిక పాఠశాల సిబ్బంది కోరగా, ఇందుకు ఎమ్మెల్యే అనుకూలంగా స్పందించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మెరుగైన ఆరోగ్యం కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘బ్రేక్ ఫాస్ట్’ పథకం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ బడులకు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించాలన్నారు. అంతకుముందు అగ్గనూరు, యాలాలలో పూర్తి చేసిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు చేసి లబ్ధిదారులతో ముచ్చటించారు. అగ్గనూరు పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
పంచాయతీ భవనం ప్రారంభం
ముద్దాయిపేట గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న పాత పంచాయతీ భవనంతో ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామస్తులు, అధికారులకు కొత్త భవనంతో సమస్యలు తీరాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ మంజుల భీమప్ప, శివయ్య, పంతుల రుద్రమణి, సొసైటీ మాజీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాల్‌రెడ్డి, మత్స్య సంఘం జిల్లా చైర్మన్ శ్రీధర్, సీనియర్ నాయకులు పేరి రాజేందర్‌రెడ్డి, భీమప్ప, హన్మంతు, అక్బర్‌బాబా, మహిపాల్, మాజీ సర్పంచ్‌లు విఠలయ్య, దేవగారి రాములు, మధుసూదన్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, ఎంఈఓ మహిపాల్‌రెడ్డి, ఎంపీడీఓ క్రిష్ణారావు, అగ్గనూరు ఉప సర్పంచ్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం
నుంచి ‘బ్రేక్ ఫాస్ట్’
ఎన్నికల హామీలను దశల వారీగా అమలు చేస్తున్నాం
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి


