గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
వైభవం.. బాలాలయ ప్రతిష్ఠాపనోత్సవం
పూజా మందిరానికి విగ్రహాలను తెస్తున్న మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ తదితరులు
హోమాలు నిర్వహిస్తున్న అర్చకులు
ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న వేదపండితులు
పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ పట్టణంలోని మహాలక్ష్మీ వేంకటేశ్వర ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా బుధవారం వైభవంగా బాలాలయ ప్రతిష్ఠాపనోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం ప్రధానాచార్యులు, అర్చకులు ఆలయ స్వాగత కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం యాగశాలలో పుణ్యాహవచనం, ఉక్త హోమములు, బాలాలయం తదితర పూజా కార్యక్రమలను వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వేద మంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించారు. స్వామివారికి మహా మంగళహారతి ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, ఆలయ అర్చకులు, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. – కొడంగల్ రూరల్
గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026


