నైతిక విజయం బీఆర్‌ఎస్‌దే: రాజుగౌడ్
తాండూరు: కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా పొద్దు తిరుగుడు పువ్వు లాంటి వారని జిల్లా గ్రంఽథాలయ సంస్థ మాజీ చైర్మన్ సందల్ రాజుగౌడ్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది కౌన్సిలర్లు గెలిస్తే 21 వేల ఓట్లు వచ్చాయన్నారు. బీఆర్‌ఎస్ నుంచి 12 మంది విజయం సాధిస్తే 18 వేలకు పైగా ఓటర్లు వచ్చాయన్నారు. 6 వార్డుల్లో కేవలం 30 ఓట్లతో స్థానాలను కోల్పోయామన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వెళ్లడంతోనే గొడవలు జరిగాయన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంత అభివృద్ధికి రూ.3,800 కోట్లు తెచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పక్కా లోకల్ అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. తాండూరుకు వలస వచ్చిన వారంతా లోకల్ అంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. బీఆర్‌ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింహులు, శ్రీనివాసాచారి, మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ ఇర్షద్, జావీద్, మాజీ కౌన్సిలర్ ఆసీఫ్, నాయకులు రుద్రు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
నైతిక విజయం బీఆర్‌ఎస్‌దే: రాజుగౌడ్


