నేడు తుంపర సేద్యం పరికరాల పంపిణీ
బొంరాస్‌పేట: ఉద్యాన శాఖ ద్వారా రాయితీపై అందించే తుంపర సేద్యం పరికరాలను గురువారం మండల కేంద్రంలో రైతులకు పంపిణీ చేయనున్నట్లు హార్టికల్చర్ అధికారి సురేంద్రనాథ్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద 2025 –26 సంవత్సరానికి గానూ మండలంలోని 76 మంది రైతులకు రాయితీపై పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు.
యాలాల: మండల నూతన ఎంఈఓగా కోకట్ జీహెచ్‌ఎం మహిపాల్‌రెడ్డిని నియమిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది ఎంఈఓగా ఉద్యోగ విరమణ పొందిన సుధాకర్‌రెడ్డి స్థానంలో మండల నోడల్ ఆఫీసర్‌గా ఉన్న జుంటుపల్లి జీహెచ్‌ఎం రమేష్‌కు బాధ్యతలు అప్పగించారు. కాగా సీనియారిటీ ప్రకారం మహిపాల్‌రెడ్డి ముందు వరసలో ఉండటంతో పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మహిపాల్‌రెడ్డి నియామకంపై పీఆర్టీయూ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు క్రిష్ణారెడ్డి, రాములు అభినందనలు తెలిపారు.
మర్పల్లి ఎంఈఓగా..
మర్పల్లి: మండల విద్యాధికారిగా ఎం అశోక్ కుమార్ నియమితులయ్యారు. కొంత కాలంగా ఇన్‌చార్జ్ ఎంఈఓగా మర్పల్లి జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం అంజిలయ్య బాధ్యతలు నిర్వహించారు. ఘణాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో జీహెచ్‌ఎంగా ఉన్న అశోక్ కుమార్‌కు ఎంఈఓగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో విద్యాప్రమాణాల పెరుగుదలకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా చూస్తానని పేర్కొన్నారు.
పరిగి మండల విద్యాధికారిగా అంజయ్య
పరిగి: మండల విద్యాధికారిగా అంజయ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నస్కల్ ఉన్నత పాఠశాల జీహెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న అంజయ్యను ఎంఈఓగా నియమించింది.
మొయినాబాద్: మున్సిపల్ పాలకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. మొయినాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సోనియా దర్శన్ బుధవారం ఆయన్ను కలిసి ఈ నెల 27న జరిగే చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవం, కౌన్సిలర్ల సన్మానసభకు హాజరవ్వాలని కోరారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, మండలి ప్రభుత్వ చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి తదితరులను కలిసి ప్రమాణస్వీకారోత్సవం, సన్మాన సభకు ఆహ్వానించారు.
నేడు తుంపర సేద్యం పరికరాల పంపిణీ


