చదువే ఆయుధం | - | Sakshi
Sakshi News home page

చదువే ఆయుధం

Jan 29 2026 8:33 AM | Updated on Jan 29 2026 8:33 AM

చదువే ఆయుధం

చదువే ఆయుధం

కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంచాలి: డీఈఓ రేణుకాదేవి

ధారూరు: చదువు ఒక ఆయుధమని.. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తించి విద్యార్థులకు నాణ్యమైన బోధన చేయాలని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ సూచించారు. ధారూరు బాలుర ఉన్నత పాఠశాల లో జరుగుతున్న స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాన్ని బు ధవారం డీఈఓ రేణుకాదేవితో కలిసి సందర్శించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ స్వీయ అనుభవాలను పంచుకున్నారు. తాను కలెక్టర్‌ కావడానికి ఎంతలా శ్రమించాల్సి వచ్చిందో ఉపాధ్యాయులకు వివరించారు. ఫిబ్రవరి చివరి వారంలో దేశవ్యాప్తంగా 3వ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఎఫ్‌ఎల్‌ఎస్‌ పరీక్ష కోసం ఉపాధ్యాయులు చేపడుతున్న కార్యాచరణ ప్రణాళిక గురించి ఆరా తీశారు. పరీక్ష స్వరూపం, ప్రశ్నల సరళి, మూల్యాంకణ విధానాలను అడిగి తెలుసుకున్నారు. భాష అలాగే గణితానికి సంబంధించిన అన్ని ప్రశ్నలు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యతోనే సామాజిక మార్పు వస్తుందన్నారు. ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు సాధించేలా బోధన చేయాలని తెలిపారు. హెచ్‌ఎంలు కుటుంబ పెద్దగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయులను సమన్వయంతో నడిపిస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం డీఈఓ రేణుకాదేవి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం, సామర్థ్యాల పెంపునకు పకడ్బందీగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. వాటిని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, సెక్టోరల్‌ అధికారులు రమేశ రజనీ, రిసోర్స్‌ పర్సన్లు నర్సింహరాజు, శ్రీనివాస్‌, నిజామొద్దీన్‌, సీఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి

అనంతగిరి: ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఫిబ్రవరి 25నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు ఉంటాయన్నారు. ప్రతి రోజూ ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. 16,400 మంది విద్యార్థులు హాజరు కానుండగా, 37 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం రవాణా సదుపాయం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. నిర్ణీత సమయానికి ప్రశ్న పత్రాలు కేంద్రాలకు చేర్చాలన్నారు. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు. జిరాక్స్‌ సెంటర్లను మూసి వేయించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్‌ ఫోన్లను అనుమతించరాదన్నారు. తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. సమావేశంలో ఇంటర్‌ మీడియట్‌ జిల్లా అధికారి శంకర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

నామినేషన్‌ సెంటర్‌ పరిశీలన

వికారాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ సెంటర్‌ను బుధవారం కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కారక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ విక్రమ్‌ సింహారెడ్డి, ఎన్నికల రిటర్నింగ్‌, అసిస్టెంట్‌, వార్డు అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన బోధన చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement