బీజేపీకి ‘జుంటుపల్లి’ గుడ్‌బై
● ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక ● 19వ వార్డు నుంచి పోటీకి సుముఖత
తాండూరు టౌన్: బీజేపీ జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకట్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జిల్లా కన్వీనర్‌కు లేఖ పంపారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మి 18 ఏళ్లుగా ఎనలేని సేవలందించానని, ప్రస్తుతం ఆ పరిస్థితులు తాండూరు నియోజకవర్గంలో కరువయ్యారన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెంకట్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను ఎస్సీ జనరల్ రిజర్వేషన్ ఉన్న 19వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
పాఠశాలనుసందర్శించిన డీపీఓ
కొడంగల్ రూరల్: మండలంలోని చిట్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఆకస్మికంగా సందర్శించారు. స్కూల్ ఆవరణలోని పాత భవనాన్ని పరిశీలించారు. దీనికి మరమ్మతులు చేపట్టాలా తొలగించాలా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తరగతి గదుల కొరత లేకుండా చర్యలు చేపడతామన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యత గుర్తించి విద్యార్థులను అడిగారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఉషశ్రీ, గ్రామ సర్పంచ్ జ్యోతి, ఉప సర్పంచ్ చంద్రకళ, వార్డు సభ్యులు హబీబుల్లా, సాయిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి
బంట్వారం: దివ్యాంగుల హక్కుల సాధనకు ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య హామీ ఇచ్చారు. బీవీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సింలు ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులు బుధవారం నగరంలోని ఆయన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసేలా చూడాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి దివ్యాంగుల సంక్షేమ శాఖగా ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన వీరయ్య ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సత్ప్రవర్తనతో మెలగాలి
డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
తాండూరు టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడరాదని. సత్ప్రవర్తనతో మెలగాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. బుధవారం పలువురు రౌడీ షీటర్లకు పట్టణ పోలీసు స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. కొన్ని పరిస్థితుల కారణంగా ఏదో ఒక తప్పు చేసి కేసుల్లో ఇరుక్కుని ఉంటారని, ఇకపై అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ప్రశాంత జీవితాన్ని గడపాలన్నారు. అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోష్ కుమార్, ఎస్సైలు పుష్పలత, సాజిద్ పాల్గొన్నారు.
బీజేపీకి ‘జుంటుపల్లి’ గుడ్‌బై
బీజేపీకి ‘జుంటుపల్లి’ గుడ్‌బై
బీజేపీకి ‘జుంటుపల్లి’ గుడ్‌బై


