అధికారిక అస్త్రం | - | Sakshi
Sakshi News home page

అధికారిక అస్త్రం

Jan 17 2026 11:47 AM | Updated on Jan 17 2026 11:47 AM

అధికారిక అస్త్రం

అధికారిక అస్త్రం

ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల పేరుతో 20వేల ఎకరాల సేకరణ మిగిలినవి సైతం సేకరించాల్సిందిగా సర్కారు మౌఖిక ఆదేశాలు సర్వే నంబర్ల వారీగా ఆరా తీస్తున్న రెవెన్యూ యంత్రాంగం

జిల్లాలో 90వేల ఎకారాలకుపైగా అసైన్డ్‌ భూములు

అసైన్డ్‌

భూములపై

సాక్షి, రంగారెడ్డిజిల్లా: అసైన్డ్‌ భూములపై ప్రభు త్వం అధికార అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించింది. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటు పేరుతో వీటిని సేకరించనుంది. ఇప్పటికే చందనవెల్లి, ఫ్యాబ్‌సిటీ సహా ఫార్మాసిటీ పేరుతో 20 వేల ఎకారాలకుపైగా సేకరించిన సర్కారు.. తాజాగా మరికొన్ని భూములను సేకరించాలని నిర్ణయించింది. ఆ మేరకు రెవెన్యూ గ్రామాల్లోని సర్వే నంబర్ల వారీగా ఉన్న అసైన్డ్‌ భూముల వివరాలపై ఆరా తీస్తోంది. ఇటీవల మీర్‌ఖాన్‌పేట వేదికగా నిర్వహించిన రైజింగ్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌లో భాగంగా రూ.ఐదున్నర లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు సేకరించాలంటే ఇందుకు మరికొంత భూమి అవసరమని భావిస్తోంది.

అదనంగా మరో పది వేల ఎకరాలు

భవిష్యనగరం చుట్టూ ఇండస్ట్రియల్‌, ఐటీ పార్కుల కోసం భారీగా భూములను సేకరిస్తోంది. వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా గత డిసెంబర్‌లో కందుకూరు మండలం తిమ్మాపూర్‌ సర్వే నంబర్‌ 38లో 350 ఎకరాలు, సర్వే నంబర్‌ 162లో 217 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మహేశ్వరం మండలం నాగిరెడ్డిపల్లిలో ఇండస్ట్రియల్‌, ఐటీ పార్కుల కోసం 198.21 ఎకరాలు అవసరమని భావించి, ఆ మేరకు 2025 ఫిబ్రవరి మొదటి వారంలో 195.05 ఎకరాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇక కందుకూరు మండలం తిమ్మాయిపల్లి సర్వే నంబర్‌9లోని 439 మంది రైతుల నుంచి 366.04 ఎకరాలు సహా మహేశ్వరం మండలం కొంగరకుర్దు సర్వే నంబర్‌ 289లోని 94 మంది రైతుల నుంచి 277.06 ఎకరాల భూసేకరణకు మార్చి 13న నోటిఫికేషన్‌ జారీ చేసింది. యాచారం మండలంలో ఇండస్ట్రియల్‌ పార్కు కోసం 638 మంది రైతుల నుంచి 821.11 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటికే సేకరించిన భూములతో పాటు అదనంగా మరో పది వేల ఎకరాలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. రెవెన్యూ అధికారులు ఇటీవల యాచారం మండలం కొత్తపల్లి, తక్కళ్లపల్లి, చింతపట్ల, తదితర గ్రామాల్లోని అసైన్డ్‌, ప్రభుత్వ భూములను

గుర్తించి, హద్దులు నిర్ధారిస్తుండటంతో ఇప్పటి వరకు ఆయా భూములపై ఆధారపడిన రైతుల్లో ఆందోళన మొదలైంది.

జిల్లాలో మొత్తం భూములు: 12,43,035 ఎకరాలు

ప్రభుత్వ భూములు: 2,18,530.2 ఎకరాలు

అటవీ భూములు: 64,803 ఎకరాలు

అసైన్డ్‌ భూములు: 90,911 ఎకరాలు

ప్రభుత్వం రైతులకు 75,450.29 ఎకరాలు

అసైన్డ్‌ చేసింది:

అసైన్డ్‌ భూములే టార్గెట్‌..

జిల్లాలో 12,43,035 ఎకరాల భూములు ఉండగా, వీటిలో 2,18,530.2 ఎకరాల ప్రభుత్వ, 64,803 ఎకరాల అటవీశాఖ భూములు ఉన్నాయి. అసైన్డ్‌ భూములు 90,911 ఎకరాలు ఉండగా.. వీటిలో 52,315 మంది రైతులకు 75,450.29 ఎకరాలను అసైన్‌ చేసింది. మరో 25,597.35 ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లాయి. అసైన్డ్‌ చేసిన భూమిలో తర్వాత 9,815.15 ఎకరాలు చేతులు మారినట్లు సమాచారం. భూదాన్‌ బోర్డు పేరున 21,931.03 ఎకరాలు ఉండాల్సి ఉండగా, వీటిలో 9,678 ఎకరాలను నిరుపేదలకు పంచారు. మిగిలిన భూమి రియల్టర్ల చేతుల్లోకి వెళ్లింది. దేవాదాయశాఖ పేరున 9360.01 ఎకరాలు ఉండగా, ఇప్పటికే 1148.15 ఎకరాలు అన్యాక్రాంతమైంది. వక్ఫ్‌

బోర్డు పరిధిలో 14,785.17 ఎకరాలు ఉండాల్సి ఉండగా, వీటిలో 13,480.25 ఎకరాలు రియల్టర్ల చేతుల్లోకి వెళ్లింది. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం (యూఎల్‌సీ) పరిధిలో తొమ్మిది వేలకుపైగా ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, వీటిలో 840 ఎకరాలు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. ప్రైవేటు పట్టా భూముల సేకరణతో ఆర్థికంచీగానే కాకుండా న్యాయపరంగా పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అసైన్డ్‌ భూములపై దృష్టి సారించాల్సిందిగా జిల్లా రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం మౌకిక ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కడ్తాల్‌, ఆమనగల్లు మండలాల్లోని భూములపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement