భూ తగాదా కేసులో ఏడుగురికి జైలు శిక్ష
పరిగి: భూ తగాదా కేసులో ఏడుగురు నిందితులకు ఏడాది జైలు శిక్ష పడిందని ఎస్‌ఐ మోహనకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి నజీరాబాద్‌తండాలో 2017లో భూ తగాదా జరిగింది. ఈ నేపథ్యంలో ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన కొందరు దాడికి పాల్పడ్డారు. అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా.. దుస్తులు చించేశారు. దీంతో ఆమె నాడు పరిగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. సుదీర్ఘ కాలం అనంతరం నేరం రుజువు కావడంతో ఈ నెల 16న పరిగి జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నాగుల శిల్ప.. కాట్రావత్ రాజు, కాట్రావత్ సాలిబాయి, కాట్రావత్ గణపతి, కాట్రావత్ మంజుల, కాట్రావత్ మోహన్, కాట్రావత్ గాంబ్లిబాయి, కాట్రావత్ రాజాబాయిలను దోషులుగా పేర్కొంటూ జైలు శిక్ష వేయడంతో పాటు.. ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున జరిమాన విధిస్తూ తీర్పు చెప్పారు.
బొంరాస్‌పేట: మండల పరిధి కొత్తూరు శివారులో శుక్రవారం రాత్రి ఓ కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. యాలాల మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ చాకలి శివయ్యతో పాటు పలువురు పోలెపల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద పూజలు, విందులో పాల్గొని తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తాండూరు ఆస్పత్రికి తరలించారు.
బొంరాస్‌పేట: సంక్రాంతిని పురస్కరించుకొని గ్రామాల్లో క్రీడోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండల కేంద్రంలో ఈ నెల 11 నుంచి కొనసాగుతున్న బీపీఎల్ క్రికెట్ టోర్నీ.. శనివారంతో ముగియనుంది. ఫైనల్‌లో పోలీసు, బొంరాస్‌పేట యువత జట్లు తలపడనున్నాయి. అదే విధంగా చౌదర్‌పల్లి, రేగడిమైలారం, మదన్‌పల్లితండాలో ఆటల పోటీలు పోటాపోటీగా జరుగుతున్నాయి.
కుల్కచర్ల: పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను.. సీఈఐఆర్ వెబ్ పోర్టల్ ద్వారా తిరిగి పొందే అవకాశం ఉందని ఎస్‌ఐ రమేష్ తెలిపారు. రెండు నెలల క్రితం ముజాహిద్‌పూర్ గ్రామానికి చెందిన తానేం కృష్ణయ్య తన మొబైల్‌ను పోగొట్టుకొని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఫోన్ ఆచూకీ తెలుసుకున్నారు. శుక్రవారం బాధితుడికి అందజేశారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఖాజ, రఘు పాల్గొన్నారు.
అనంతగిరి: ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వికారాబాద్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తాండూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిననగేష్(32), పెయింటింగ్ పనిచేస్తూ గోధుమగూడలో జీవనం సాగించేవాడు. బుధవారం పనులు ముగించుకుని, అర్ధరాత్రి వేళలో బైక్‌పై గోధుమగూడ వైపు వెళ్తున్న క్రమంలో వంతెనను ఢీకొట్టి కిందపడి మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించిన కొందరు మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈ మేరకు కుటుంబీకులు ఘటనా స్థలికి చేరుకొనినగేష్‌గా గుర్తించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
భూ తగాదా కేసులో ఏడుగురికి జైలు శిక్ష
భూ తగాదా కేసులో ఏడుగురికి జైలు శిక్ష


