బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
కందుకూరు: సాధారణంగా ఎడారి దేశాల్లో మాత్రమే పండే ఖర్జూర పంటను యూట్యూబ్‌లో చూసిన ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సరస్వతిగూడలోని తన వ్యవసాయ పొలం ఏడు ఎకరాల్లో పండిస్తున్నాడు. అచ్చంపేటలోని మరో పదెకరాల విస్తీర్ణంలో సాగు చేసి విజయం సాధించాడు. ఏడేళ్ల క్రితం యూకే నుంచి ల్యాబ్‌లో డెవలప్ అయిన టిష్యూ కల్చర్ బర్హీ రకం మొక్కలను దిగుమతి చేసుకుని సాగు చేయగా, ప్రస్తుతం పంటతో ఆశించిన లాభాలు అందుకుంటున్నాడు. కిలో రూ.110 నుంచి రూ.120 మధ్య హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నాడు. ఈ ఏడాది ఏడు ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 24 టన్నుల వరకు దిగుబడి వచ్చిందని చెబుతున్నాడు. ఖర్చులు పోనూ ఎకరాకు సరాసరి రూ.2 లక్షల వరకు లాభాలు వచ్చాయని తెలిపాడు.
ఔరా.. ఖర్జూర
బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026


