● గ్యాక్ ప్రూట్.. కొత్త రూటు
తుక్కుగూడ: మంఖాల్ డివిజన్ పరిధిలోని ఇమామ్‌గూడకు చెందిన బాకారం బుచ్చిరెడ్డి తనకున్న భూమిలో వియత్నాంకు చెందిన గ్యాక్ ప్రూట్‌ను సాగు చేస్తున్నాడు. నారును ఏపీలోని పోలవరం ప్రాంతం నుంచి తీసుకువచ్చాడు. ఎకరంలో సుమారు రూ.9 లక్షలు ఖర్చు చేసి 210 మొక్కలు నాటాడు. ప్రస్తుతం మంచి దిగుబడి వస్తోంది. మొక్క నాటిన నుంచి 4–5 నెలల్లో పూత ప్రారంభమవుతుందని, ఆడ, మగ పూతను గుర్తించి పాలినేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపాడు. పాలినేషన్ తరువాత పిందె మొదలై మూడు నెలల్లో మూడు, నాలుగు దశలు మారి పండు తయారువుతుందని చెబుతున్నాడు. ఏడు నెలల్లో విక్రయించేందుకు అనువుగా మారుతుందని, ఒక్కో పండు దాదాపు కిలో బరువు ఉంటుందన్నాడు. ప్రస్తుతం మార్కెట్లో రూ.1000 నుంచి రూ.1,200కు విక్రయిస్తున్నట్టు చెప్పాడు.
● గ్యాక్ ప్రూట్.. కొత్త రూటు


