రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫొటో పెట్టాలి
బీజేపీ సాంస్కృతిక శాఖ జిల్లా కో–కన్వీనర్ నరేందర్‌రెడ్డి
కేశంపేట: కేంద్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అర్హులకు బియ్యం అందిస్తోందని బీజేపీ సాంస్కృతిక శాఖ జిల్లా కో కన్వీనర్ కర్రెడ్ల నరేందర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సంతాపూర్‌లో లబ్ధిదారులకు ఇస్తున్న బ్యాగులను అయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఇస్తున్న 5 కిలోలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కిలో బియ్యం మాత్రమే అందిస్తూ సీఎం, డిప్యూటీ సీఎం, పౌరసరాఫరాల శాఖ మంత్రుల ఫొటోలతో కూడిన బ్యాగును లబ్ధిదారులకు అందిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తున్న బియ్యం బస్తాలపై ప్రధాని ఫొటోను కూడా ప్రచురించాలని ఆయన డిమాండ్ చేశారు.


