కుల అసమానతలను నిర్మూలించాలి
కొత్తూరు: సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న కుల అసమానతలను తగ్గించాలని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి జిల్లా కన్వీనర్ మోహనకృష్ణ అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన పలువురితో కలిసి మండలంలోని ఇన్ముల్‌నర్వలో అగ్రవర్ణాల చేతుల్లో దారుణ హత్యకు గురైన రోహిత్ వేముల వర్ధంతికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన హత్యకు గురై పదేళ్లు గడుస్తున్నా సందర్భంగా వర్ధంతిని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో సంఘం సభ్యులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సభ్యులు అకాశ్, లక్ష్మయ్య, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
సంఘం జిల్లా కన్వీనర్ మోహనకృష్ణ


