బ్యాలెట్‌తోనే మున్సిపల్ ఎలక్షన్స్
● తాండూరులో 36 వార్డులకు
117 పోలింగ్ కేంద్రాలు
● నాలుగు రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ
మున్సిపల్ ఎన్నికలకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఓటరు జాబితాలు విడుదల చేసి అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నారు.
తాండూరు: మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నే నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అందుకు గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం వినియోగించిన బ్యాలెట్ బాక్స్‌లను తాండూరు మండల పరిషత్ కార్యాల యం నుంచి మున్సిపల్ అధికారులు సెయింట్ మా ర్క్స్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూ మ్‌కు తరలించారు. 2014లో ఈవీఎం మిషన్ల ద్వా రా ఎన్నికలను నిర్వహించారు. ఈ ఏడాది 2020 మాదిరిగానే బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఓటరు జాబితా ఫైనల్ లిస్ట్ ప్రదర్శించారు. కులాల వారీగా ఓటర్ల గుర్తింపు ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
36 వార్డులకు 234 బ్యాలెట్ బాక్స్‌లు
ఇప్పటికే మున్సిపాలిటీల వారీగా పోలింగ్ నిర్వహించేందుకు కావాల్సిన బ్యాలెట్ బాక్స్‌ల కోసం ఎన్నికల అధికారులకు మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. తాండూరు మున్సి పల్‌లో 36 వార్డులు ఉండగా ఒక్కో పోలింగ్ కేంద్రానికి రెండు బాక్స్‌ల చొప్పున 234 బ్యాలెట్ బాక్స్‌ల అవసరం అవుతాయి. అదనంగా మరో 44. బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధంగా ఉంచనున్నారు. గ్రామ పంచాయతీల ఎన్నికల కోసం వినియోగించిన బ్యాలెట్ బాక్స్‌లు మండల పరిషత్ కార్యాలయంలో ఉండటంతో వాటిని మంగళవారం తాండూరు మున్సిపల్ అధికారులు సెయింట్ మార్క్స్‌స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి భద్రపరిచారు.


