అపరిచిత వ్యక్తులు కనిపిస్తే 100కు ఫోన్ చేయండి
కరన్‌కోట్ పీఏస్ ఎస్‌ఐ రాథోడ్ వినోద్
తాండూరు రూరల్: గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేయాలని కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ రాథోడ్ వినోద్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సంకాంత్రి పండుగకు సొంతూరికి వెళ్లే వారు బంగారంనగదు లాకర్లలో భద్రపర్చుకోవాలన్నారు. గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
ప్రజాసేవలో
విద్యుత్ శాఖ ముందంజ
దౌల్తాబాద్: ప్రజాబాట, గృహజ్యోతి, ఉచిత వ్యవసాయ విద్యుత్ సేవలు, తక్షణ లోపాల పరిష్కారంలో విద్యుత్ శాఖ ముందంజలో నిలుస్తుందని ఆ శాఖ ఏఈ మహిపాల్ అన్నా రు. గృహజ్యోతి, ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు కార్డులను అందించారు. గ్రామాల్లో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది గోవిందు, రాజు, ఫయ్యాజ్, హజార్, ఆంజనేయులు, వెంకటప్ప, నర్సింలు, మహిపాల్ తదితరులున్నారు.
సామాజిక సేవలను
విస్తృతం చేస్తాం
లయన్స్ క్లబ్ తాండూరు అధ్యక్షుడు
శరణుబసప్ప
తాండూరు: లయన్స్ క్లబ్ సామాజిక సేవలను మరింత విస్తృతం చేస్తామని లయన్స్ క్లబ్ తాండూరు అధ్యక్షుడు శరణుబసప్ప అన్నారు. మంగళవారం పట్టణంలోని కాళికా దేవి ఆలయం ఎదుట అడ్డా కార్మికులను అన్నదాన కార్యక్ర మం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ద్వారా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ తాండూరు ప్రతినిధులు గౌరీ శంకర్, ఓం ప్రకాశ్ సోమాని, దామోదర్, వినోద్ జైన్, గోపాల కృష్ణ యాదవ్, కల్వ రవిశంకర్, సంగప్ప, బసనప్ప, ఆర్‌డీ సోని తదితరులు పాల్గొన్నారు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
కేశంపేట: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని లేమామిడి శివారులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. తలకొండపల్లి మండల పరిధిలోని లింగరావుపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ ఇసాక్ (51) గ్రామంలో కుటుంబంతో కలిసి కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మంగళవారం పని నిమిత్తం బైక్‌పై కేశంపేటకు వచ్చి తిరిగి మధ్యాహ్నం ఇంటికి వెళ్తున్నాడు. మండల పరిధిలోని లేమామిడి శివారులో ముందు నుంచి వస్తున్న లారీని డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇసాక్‌ను గ్రామస్తులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ప్రభాకర్‌కు డాక్టరేట్
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం పడకల్ కు చెందిన ప్రభాకర్ చౌటి జర్నలిజంలో డాక్టరేట్ అందుకున్నారు. భారతీయ మీడియా పరిణామాలలో అత్యంత కీలకంగా మారిన అస హనం అనే అంశంపై సీనియర్ ప్రొఫెసర్ డాక్ట ర్ కె.నరేందర్ మార్గనిర్దేశకత్వంలో పరిశోధన చేశారు. సంతృప్తి చెందిన ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్లు, ఉన్నతాధికారులు ప్రభాకర్‌కు డాక్టరేట్ పట్టా అందజేశారు.
అపరిచిత వ్యక్తులు కనిపిస్తే 100కు ఫోన్ చేయండి


