పనులు వేగవంతం చేయండి
● ఎడ్యుకేషన్ హబ్ ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రతీక్ జైన్
దుద్యాల్: మండల పరిధిలోని హకీంపేట్ గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న ఎడ్యుకేషన్ హబ్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాంట్రాక్టర్లకు, అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విద్యా కేంద్రాల నిర్మాణంలో ఇప్పటికే ఆలస్యం అవుతుందని, పండగ తర్వాత పనుల్లో వేగం పెంచాలన్నారు. ఫిబ్రవరి చివరి వారం వరకు పునాది దశ వరకు పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. విద్యాలయాలు నిర్మించే ప్రాంతం వరకు రహదారులను చక్కదిద్దాలన్నారు. రాష్ట్రస్థాయి అధికారులు ఈ ప్రాంతాన్ని ఎప్పుడైనా పరిశీలించే అవకాశం ఉందన్నారు. అప్పటిలోగా రహదారులకు మరమ్మతులు చేయాలన్నారు.కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్, ఎడ్యుకేషన్ హబ్ ఎస్‌ఈ విజయభాస్కర్‌రెడ్డి, డీఈలు రాజయ్య, శ్రీనివాస్, నాగేశ్వర్ రావు, ఏఈలు జనార్దనమూర్తి, విజయభాస్కర్‌రెడ్డి, మహ్మద్ ముజ్‌దాబా, కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఐ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.


