శ్రీవారి ఆలయంలో ముగ్గుల పోటీలు
కొడంగల్: పట్టణంలోని పద్మావతీ సమేత శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగు రంగుల ముగ్గులు వేశారు. శ్రీవారి ఆలయ ప్రాంగణం రంగవల్లులతో కళకళలాడింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మురహరి వశిష్ట పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహించారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత, విశ్రాంత డ్రాయింగ్ మాస్టార్ బస్‌లింగయ్య, విశ్రాంత ఉపాధ్యాయుడు చంద్రప్ప. ఆర్టిస్టు నగేశ్‌లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. 42 మంది మహిళలు, విద్యార్థినులు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి తాండూరుకు చెందిన సుజాత, అపూర్వ, రెండవ బహుమతి బోయిని సరిత, స్వప్న, మూడో బహుమతి సౌజన్య, సరిత అందుకున్నారు. విజేతలకు ఎమ్‌పీఆర్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో బహుమతులను పంపిణీ చేసింది. మొదటి బహుమతిని నందారం ప్రశాంత్, ఎస్‌ఐ సత్యనారాయణ చేతుల మీదుగా అందించారు. విజేతలతో పాటు ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు ఇచ్చారు. కార్యక్రమంలో నందారం రత్నం, మధు, ధరూర్ శ్రీనివాసాచార్యులు, మురహరి వశిష్ట, తిరుమలేశ్, బాల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయంలో ముగ్గుల పోటీలు
శ్రీవారి ఆలయంలో ముగ్గుల పోటీలు


