రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి
దౌల్తాబాద్: రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని ఎస్‌ఐ రాజుకుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తాలో ఆటో డ్రైవర్లు, ద్విచక్రవాహనదారులకు ప్రజలకు అవగాహన నిర్వహించారు. నిబంధనలు పాటిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బత్తుల శ్రీనివాస్‌రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులున్నారు.
మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు
దుద్యాల్: జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా మండల పరిధిలోని ఈర్లపల్లిలో మంగళవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సంరద్భంగా ఎస్‌ఐ శ్రీశైలం మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది శంకర్, కృష్ణ, రాజు, సర్పంచ్ మొగులప్ప, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్, కృష్ణ, సంతోశ్, అంజిలయ్య పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి


