విభిన్న పంటల సాగు హర్షణీయం
ఇక్రిశాట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ స్టాన్‌ఫోర్డ్ బ్లేడ్
నవాబుపేట: రైతులు భిన్నమైన పంటల సాగు చేపట్టడం హర్షణీయమని ఇక్రిశాట్(అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన సంస్థ) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వికారాబాద్ వారి సమన్వయంతో శాస్త్రవేత్తలు మంగళవారం మండలంలోని పూలపల్లి, చిట్టిగిద్ద గ్రామాల్లో పంటలను పరిశీలించారు. ఇక్రిశాట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ స్టాన్‌ఫోర్డ్ బ్లేడ్ రైతులతో నేరుగా మాట్లాడి సాగు విధానాలు, సమస్యలు, పంటల ఎంపిక, పురుగుల నియంత్రణ చర్యలు, పంటల మార్కెటింగ్ అంశాలపై ఆరా తీశారు. కంది, జొన్న, శనగ, కుసుమ, క్యారెట్, టమాట, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయల పంటలకు వాతావరణ మార్పుల ప్రభావాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇక్రిశాట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హరికిషన్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వికారాబాద్ సమన్వయకర్త డాక్టర్ టి.రాజేశ్వర్‌రెడ్డి, బి.రాజ మధుశేఖర్, యంగ్ ప్రొఫెషనల్స్ సల్మాన్, కేశవ కృష్ణ, ఏఓ జ్యోతి, వ్యవసాయ విస్తరణ అధికారి పవన్, పలువురు రైతులు పాల్గొన్నారు.


