కడుమూరు ఉపాధ్యాయుడికి రెండు పురస్కారాలు
పూడూరు: సమాజ మార్పు కోసం విద్యార్థులను, యువతను చైతన్యం చేస్తూ సామాజిక సేవల్లో పాలుపంచుకుంటున్న కడుమూరు పాఠశాల ఉపాధ్యాయుడు మధు వివేకానంద స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు. సోమవారం నగరంలోని త్యాగరాయ గానసభలో జాతీయ తెలుగు సారస్వత పరిషత్, ఆదిలీల ఫౌండేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో వివేకానంద జయంత్యుత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ సముద్రాల వేణుగోపాల్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. అనంతరం రవీంద్రభారతిలో నిర్వహించిన సాహితీ కవి సమ్మేళనంలో ప్రతిభ కనబర్చి సాహితీ అకాడమీ చైర్మన్ బాలాచారి చేతుల మీదుగా యువ కవి స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు. ఒకే రోజు రెండు పురస్కారాలు అందుకున్న మధును పూడూరు ఎంఈఓ సాయిరెడ్డి, సర్పంచ్ శివశంకర్, ఉపాధ్యాయులు అభినందనలతో ముంచెత్తారు.
వృద్ధులకు ‘ప్రణామ్’
ఒంటరితనం పోగొట్టేందుకు
డే కేర్ సెంటర్
అనంతగిరి: వయోవృద్ధుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ప్రణామ్’డేకేర్ సెంటర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ప్రజా భవన్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి బి.కృష్ణవేణి మాట్లాడుతూ.. జిల్లాలోని వయోవృద్ధుల సంక్షేమ కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలన్నారు. వయోవృద్ధుల బాగోగులు చూసుకునేందుకు, వారి ఒంటరితనాన్ని దూరం చేసేందుకు సేవలు ఉంటాయన్నారు. వయోవృద్ధులు సామాజికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయని అన్నారు. ప్రభుత్వ సెలవుదినాలు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు కొనసాగుతాయని వివరించారు. ఈ డేకేర్ సెంటర్‌లో వయోవృద్ధుల కాలక్షేపానికి టీవీ, ఇంటర్నెట్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్ తదితర సేవలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు.
ఇస్కాన్ కార్యక్రమాలు
అభినందనీయం
రెస్ మిల్లర్స్ అసోసియేషన్
రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ రెడ్డి
కుల్కచర్ల: హిందూ ధర్మ పరిక్షరణకు ఇస్కాన్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బొలుసాని శ్రీధర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ర్యాలీ నిర్వహించి భగవద్గీత పారాయణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. భగవద్గీత సనాతన ధర్మాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద ర్ గౌడ్, జానకీరాం చౌహాన్, హరికృష్ణ, అంజిలయ్య, మైపాల్, విజయకుమార్, ఆంజనేయు లు, ముకుంద, బాలు, శ్రీశైలం పాల్గొన్నారు.
సర్పంచ్‌లుగా ఎన్నికైన డీలర్లు రాజీనామా చేయండి
ఇబ్రహీంపట్నం రూరల్: సర్పంచ్‌లుగా ఎన్నికైన రేషన్ డీలర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని రంగారెడ్డి పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్ సూచించారు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నంలో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం రాజీనామా చేయకుంటే డీలర్‌షిప్ రద్దునకు సిఫారసు చేస్తామన్నారు.
కడుమూరు ఉపాధ్యాయుడికి రెండు పురస్కారాలు
కడుమూరు ఉపాధ్యాయుడికి రెండు పురస్కారాలు


