పదేళ్లుగా పనిచేస్తున్నా భద్రత లేదు
కుల్కచర్ల: ఏళ్ల నుంచి గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్‌గా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదని.. వేతనాల పెంపు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మే రకు సోమవారం వారు నగరంలోని ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు కుల్కచర్ల మండల అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ మాట్లాడుతూ.. ఏళ్ల నుంచి చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నామని వివరించారు. సీఆర్టీలుగా తమతో సమానంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రూ.29వేలు వేతనం ఉండగా.. తమకు రూ.10, 500 ఇస్తున్నారన్నారు. పదేళ్లుగా పని చేస్తున్నా తమ కు ఉద్యోగభద్రత లేదని వాపోయారు.తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ రాజేందర్, వెంకటయ్య, శ్రీకాంత్, బాల్‌రాజ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.


