ఆధ్యాత్మిక తత్వాన్ని ఆచరణలో పెట్టాలి
డాక్టర్ భాస్కరయోగి
పరిగి: మానవ జీవి తం సార్థకం కావాలంటే ఆధ్యాత్మిక తత్వాన్ని ఆచరణ లో పెట్టాలని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ భాస్కరయో గి సూచించారు. భాస్కర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం పుష్య సత్సంగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు విలువతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. యువత దురలవాట్లకు దూరంగా ఉండి కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. భారతీయతకు ఆధారం స్వామి వివేకానందుడ ని చెప్పారు. ఈ కార్యక్రమంలో సురేశ్ కొచాటి ల్, నర్సిరెడ్డి, వీరేశం, వెంకటేశం పాల్గొన్నారు.


