ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
తాండూరు ఏడీఏ కొమురయ్య
బషీరాబాద్: రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని తాండూరు ఏడీఏ కొమురయ్య సూచించారు. మీసేవా కేంద్రాల్లో, ఏఈఓల దగ్గర ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. రిజిస్ట్రీ చేసుకుంటేనే రబీలో పీఎం కిసాన్ యోజన పథకం అందుతుందన్నారు. సోమవారం మండల పరిధి జీవన్గీలో 120 మంది రైతులకు ఆన్‌లైన్‌లో నమోదు చేశామని తెలిపారు. అయితే రైతుల దగ్గర చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని, దీనిపై దృష్టి సారించాలని సర్పంచ్ బసప్ప ఏడీఎను కోరారు. దీనికి స్పందించిన ఆయన.. రైతులు ఒక్కో దరఖాస్తుకు రూ.30 కంటే ఎక్కువ చెల్లించరాదని సూచించారు. అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే ఏఈఓలకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.


