భవనం దొరకదు.. అద్దె చెల్లించరు
●సంకట స్థితిలో ప్రొహిబిషన్ అధికారులు ●సీ్త్ర శక్తి భవనం ఇచ్చేందుకు ఏఈపీఎం విముఖత
మోమిన్‌పేట: ప్రభుత్వ కార్యాలయాలు జనవరి 1 నుంచి సర్కారు భవనాల్లోనే కొనసాగించాలని, ఎట్టి పరిస్థితిల్లోనూ అద్దె చెల్లించమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ.. సొంత భవనం దొ రకక, అద్దె మిద్దెలో కొనసాగలేక ప్రొహిబిషన్ ఎకై ్స జ్ సర్కిల్ స్టేషన్ అధికారులు చింత చెందుతున్నా రు. కార్యాలయానికి సరిపడా సర్కారు భవనాలు లేకపోవడం, ప్రభుత్వం అద్దె ఇవ్వనని చెప్పడంతో ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతున్నారు.
సీ్త్ర శక్తి భవనం ఉన్నా..
తాజాగా సొంత భవనాల్లో కార్యాలయాలు కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఇబ్బందులు తలెత్తాయి. మండల కేంద్రంలో మహిళా సమాఖ్యకు 12 సంవత్సరాల క్రితం సీ్త్ర శక్తి భవనం నిర్మించారు. అందులో ఉపాధిహామీ పథకానికి సంబంఽధించిన సిబ్బంది కార్యకలాపాలకు మొదటి అంతస్తు కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్ ప్రస్తుతం ఖాళీగానే ఉంది. అందులో ఎకై ్సజ్ కార్యాలయం కొనసాగించేందుకు అవకాశం ఉంది. అది తప్పితే మరో మార్గం లేదు. ఇందులోకి మార్చేందుకు ఎకై ్సజ్ సీఐ సహదేవుడు సముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అ భవనం అప్పగించేందుకు ఏఈపీఎం సిద్ధంగా లేనట్లు సమాచారం.
ఆరేళ్లుగా చెల్లించని బకాయి
ఆరేళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతున్న ఎకై ్సజ్ కార్యాలయం.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆ ఇంటి యజమాని పేర్కొంటున్నారు. నెలకు రూ.8116ల అద్దె చెల్లించేలా అగ్రిమెంటు చేసుకున్నామని తెలిపారు. ఇప్పుడు ఖాళీ చేస్తే బకాయి ఎలా అని వాపోతున్నాడు. అద్దె ఎప్పుడు అడిగా.. ప్రభుత్వానికి బిల్లు పంపిచామని అధికారులు చెబుతున్నారని వివరించారు.
నిధులు లేక.. నిర్మాణం కొనసాగక
మర్పల్లి మండల కేంద్రంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్.. ఆరేళ్ల క్రితం మోమిన్‌పేట మండల కేంద్రానికి ప్రభుత్వం మార్చింది. స్టేషన్ నిర్మించుకొనేందుకు భూమిని కేటాయించింది. భవనం నిర్మాణదశలో ఉంది. కానీ స్లాబు లెవల్లో ఏడాది కాలంగా నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీనికి కారణం నిధులు విడుదల కాకపోవడమేనని సదరు కాంట్రాక్టర్ పేర్కొంటున్నారు.


