కాలుష్యకారక బైక్‌లపై ఉక్కుపాదం
తాండూరు టౌన్: కాలుష్యకారక వాహనదారులపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ముఖ్యంగా బుల్లెట్ బైకుల సైలెన్సర్ల మార్పిడితో ఏర్పడుతున్న శబ్ద కాలుష్యంపై దృష్టి సారించారు. ప్రజల ఫిర్యాదు మేరకు పలు వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు. వాటి సైలెన్సర్లను సోమవారం జేసీబీతో తుక్కు చేయించారు. కేసులు నమోదు చేశారు.
చర్యలు తప్పవు
శబ్దకాలుష్యానికి కారకులయ్యే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నర్సింగ్ యాద య్య హెచ్చరించారు. సైలెన్సర్లు మార్పిడి చేసి, బుల్లెట్ వాహనాలతో పట్టణంలో రయ్‌రయ్‌మని దూసుకుపోతూ.. అసౌకర్యం కలిగిస్తున్న వారిపై పట్టణ వాసులు పలువురు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ ఆదేశాలతో సీఐ, ఎస్‌ఐ లు, సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 30 బుల్లెట్ బైకులను సీజ్ చేశారు. వారిపై కేసులు నమోదు చేశారు. అనంతరం జేసీబీ సహాయంతో ఆ సైలెన్సర్లను నుజ్జునుజ్జు చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సౌండ్ పొల్యూషన్‌కు కారణమైన బైకులను సీజ్ చేసి, వాటి సైలెన్సర్లను తుక్కు చేశామని చెప్పారు. రూల్స్ తప్పనిసరిగా పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సైలెన్సర్‌లు మార్చే మెకానిక్‌లపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోష్ కుమార్, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
జేసీబీతో సైలెన్సర్లనునుజ్జునుజ్జు చేయించిన పోలీసలు
శబ్దకాలుష్యానికి పాల్పడితే చర్యలు
సైలెన్సర్లు మార్చే మెకానిక్‌లపై కేసులు
తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ


