తప్పుడు వార్తల ప్రసారం తగదు
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
అనంతగిరి: రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఓ ఐఏఎస్ అధికారిపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించడం సరికాదని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన డీసీసీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్ జాదవ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్‌రెడ్డితో కలిసి వికారాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో తమ పదవులను త్యాగం చేసిన చరిత్ర వారిపై తప్పుడు ప్రచారం చేయడం ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి కొన్ని చానెల్స్ పని కట్టుకుని దుష్ప్రాచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు పూర్తిగా సీఎస్, ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుందన్నారు. అందులో వారి ప్రమేయం ఉండదన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడితో కేటీఆర్
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును ఆదివారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు.
అనంతగిరి: స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్‌టీఎఫ్)జిల్లా అధ్యక్షుడిగా తలారి సునందం, ప్రధాన కార్యదర్శిగా అనంతయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆదివారం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారికి నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సునందం, అనంతయ్య మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో జిల్లా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడుతానన్నారు.
ఇబ్రహీంపట్నం: దండుమైలారం గ్రామానికి చెందిన పోకల్‌కార్ కిషన్‌ప్రసాద్‌జీ హైదరాబాద్ సర్కిల్ ఉత్తమ పోస్ట్‌మాన్‌గా అవార్డు దక్కించుకున్నారు. రాష్ట్రంలో పోస్ట్‌మాన్‌గా ఉత్తమ సేవలందిస్తున్న 12 మందిని ఎంపిక చేశారు. అందులో వనస్థలిపురం పోస్టాఫీస్‌లో పోస్టుమాన్‌గా పనిచేసే దండుమైలారం గ్రామానికి చెందిన పి. కిషన్‌ప్రసాద్‌జీ ఎంపికయ్యారు. నగరంలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలంగాణ పోస్టు మాస్టర్ జనరల్ మేనేజర్ (పీఎంజీ) సుమిత్రఅయోధ్య, హైదరాబాద్ పోస్టల్ డిపార్టమెంట్ సీనియర్ సూపరింటెండెంట్ హేమలత చేతుల మీదుగా కిషన్‌ప్రసాద్ అవార్డు అందుకున్నారు.
చేవెళ్ల: నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో సోమవారం మంత్రుల పర్యటన ఉంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లిలో కోట్లరూపాయల అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నట్లు చెప్పారు. జిల్లా ఎమ్మెల్యేలు, పలువురు జిల్లా నాయకులు పాల్గొంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇటీవల గెలిచిన ఐదు మండలాల సర్పంచులకు చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్‌లో మంత్రుల చేత సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
తప్పుడు వార్తల ప్రసారం తగదు
తప్పుడు వార్తల ప్రసారం తగదు


