యోధుడు వడ్డె ఓబన్న
అనంతగిరి: తెల్లదొరల అక్రమ పన్ను వసూళ్లపై తిరుగుబాటు చేసిన యోధుడు వడ్డె ఓబన్న అని బీసీ వెల్ఫేర్ అధికారి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా వడ్డె ఓబన్న జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటంలో ఓబన్న ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవని కీర్తించారు. ఆ మహనీయుడి జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రేనాడు ప్రాంతంలో జన్మించిన ఓబన్న ఆనాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన సాయుధ పోరులో సైన్యాధ్యక్షుడిగా వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. వడ్డె ఓబన్న ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు, హాస్టల్ వార్డెన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బీసీ వెల్ఫేర్ అధికారి మాధవరెడ్డి


