గెలుపోటములు సమానంగా స్వీకరించాలి
కడ్తాల్: గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఎస్‌ఐ వరప్రసాద్ సూచించారు. కడ్తాల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎనిమిది రోజులుగా నిర్వహిస్తున్న కడ్తాల్ ప్రీమియర్ లీగ్–4 పోటీలు శనివారంతో ముగిసాయి. ఈ పోటీల్లో కడ్తాల్ ఈగల్స్ జట్టు విజయం సాధించగా కడ్తాల్ సుప్రీం జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ సందర్భంగా విజేత జట్టుకు రూ.50 వేలు, రన్నరప్ జట్టుకు రూ.30 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడల్లోనూ ఉన్నతంగా రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్‌గుప్తా, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎర్రోల రాఘవేందర్, హనుమాన్ యూత్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, టోర్నీ నిర్వాహకులు వడ్డె రాజు, సంతోశ్ కుమార్, దేవేందర్‌గౌడ్, హెచ్‌ఆర్ మహేశ్, జగన్‌యాదవ్, గణేశ్‌గౌడ్, వెంకటేశ్, విజయ్‌గౌడ్, రవినాయక్, జహంగీర్‌బాబా, లక్ష్మయ్య, రాజేందర్‌గౌడ్, ముత్తి కృష్ణ, మహేశ్, రవీందర్‌రెడ్డి, నర్సింహ, జగత్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, జావీద్ వార్డు సభ్యులు నాయకులు ఉన్నారు.
కడ్తాల్ ఎస్‌ఐ వరప్రసాద్


