పెండింగ్ పనులు పూర్తి చేయాలి
అభివృద్ధి పనులు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం
● ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి
ఆమనగల్లు: మున్సిపల్ పరిధిలోని పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. పట్టణంలోని 13వ వార్డులో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బస్తీబాట కార్యక్రమానికి శనివారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో పర్యటిస్తూ సమస్యలనుతెలుసుకున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అసంపూర్తి పనులను వారు పరిశీలించారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మరిచిందన్నారు. అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్, బీఆర్‌ఎస్ నాయకులు గోపి, చాంద్‌పాష, అచ్చయ్య, రమేశ్, బాలస్వామి, రఘు, వెంకటయ్య, సుభాశ్, రాజు, వెంకటేశ్, శివకుమార్, జగన్, సైదులుగౌడ్, రమేశ్, ప్రసాద్, కిరణ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.


