మున్సిపల్ ఎన్నికల్లో విజయం మాదే
అనంతగిరి: మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం మాదేనని బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం వికారాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో పార్టీ పట్టణ ముఖ్యనాయకులతో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని అన్ని వార్డుల బరిలో ఉంటామని, పార్టీ నాయకులు సమష్టిగా పనిచేసి, కాషాయ జెండా ఎగురవేసేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజు, సదానంద్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు సుచరితారెడ్డి, శ్రీదేవి, నాయకులు శ్రీధర్‌రెడ్డి, పాండుగౌడ్, శ్రీకాంత్, నరోత్తంరెడ్డి, రాజేందర్‌రెడ్డి, నందు, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


