మహిళా దొంగ అరెస్ట్
కొడంగల్ రూరల్: పట్టణంలోని బస్టాండులో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న మహిళను ఆదివారం స్థానిక పోలీసులు పట్టుకున్నారు. వారి కథనం మేరకు.. ఈ నెల 25న టేకుల్‌కోడ్ గ్రామానికి చెందిన రాములమ్మ తాండూరు బస్సు ఎక్కుతున్న క్రమంలో ఆమె మెడలోని గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేశారు. అదే రోజు దౌల్తాబాద్ మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన నారాయణమ్మ మహబూబ్‌నగర్ బస్సు ఎక్కుతుండగా ఆమె గొలుసునూ దొంగిలించారు. ఇరువురు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కొడంగల్ బస్టాండులో ప్రత్యేక నిఘా ఉంచారు. ఆదివారం పరిగి పట్టణం తుంకుల్‌గూడకు చెందిన కావలి అనంతమ్మ అనే మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా తానే బంగారు గొలుసులు కొట్టేసినట్లు ఒప్పుకుంది. ఆమె నుంచి నగలు రికవరీ చేసినట్లు సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. కావలి అనంతమ్మను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వారు తెలిపారు.
ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు
రెండు గొలుసుల అపహరణ
రిమాండ్‌కు తరలింపు
వివరాలు వెల్లడించిన సీఐ శ్రీధర్‌రెడ్డి


