మహిళల ఆరోగ్యమే లక్ష్యం
ధారూరు: గర్భిణులు, బాలింతల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారికి అవసరమైన మందులు, ఇంజెక్షన్లు సకాలంలో ఇవ్వాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. గురువారం మండలంలోని నాగసమందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు తీసుకెళ్లే మాత్రలు తప్పనిసరిగ్గా వాడేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు వారిని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉండాలన్నారు. ఆస్పత్రిలో మందుల కొరత లేకండా చూసుకోవాలని తెలిపారు. అనంతరం ఆస్పత్రికి వచ్చిన గర్భిణుల స్క్యానింగ్ రిపోర్టులను పరిశీలించారు. స్క్యానింగ్ ఇక్కడే చేస్తున్నారా అని డాక్టర్‌ను ప్రశ్నించగా తాండూరు, వికారాబాద్ పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు పంపుతున్నట్లు తెలిపారు. విధులకు సక్రమంగా రావాలని డాక్టర్, సిబ్బందికి సూచించారు.
ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి
అనంతగిరి: వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ మరమ్మతులతోపాటు ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. గురువారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్న ఫర్నిచర్, ఇతర సామగ్రిని తొలగించాలని ఆదేశించారు. ఫ్యాన్లు సమకూర్చుకోవాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సదరం క్యాంప్‌ను పరిశీలించి సౌకర్యాలు సమకూర్చుకోవాలని డీఆర్డిఓ శ్రీనివాస్‌కు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్డీఓ వాసు చంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
బంట్వారం కేజీబీవీ సందర్శన
బంట్వారం: స్థానిక కేజీబీవీ వసతి గృహాన్ని గురువారం కలెక్టర్ ప్రతీక్ జైన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలన్నారు. బాగా చుదువుకొని పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు. రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అర్హులకు అందేలా చొరవ చూపాలన్నారు. అనంతరం గ్రామంలోని రేషన్ దుకాణాన్ని సందర్శించి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీఓ నాగరాజు, డాక్టర్ మజీద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
మెనూ అమలు చేయాల్సిందే
మర్పల్లి: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతీక్ జైన్ హెచ్చరించారు. గురువారం మర్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, బీసీ బాలుర వసతి గృహం, పట్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మునీరుద్దీన్, ఎంపీఓ లక్ష్మీకాంత్, ఆశ్రమ పాఠశాల ఇన్‌చార్జి నర్సింగ్‌రావు, డాక్టర్ మానస తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్


