అవినీతి జలగలపై విచారణ
అర్బన్ పార్కులో పర్యటించిన
విజిలెన్స్ అధికారులు
బషీరాబాద్: తాండూరు అర్బన్ పార్కులో జరిగిన అక్రమాలపై అటవీశాఖ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.పార్కులో రూ.16 లక్షల నిధులతో చేపట్టిన వాకింగ్ పాత్ పనుల్లో బీట్ ఆఫీసర్ మల్లయ్య, సెక్షన్ అధికారి ఫీర్యానాయక్ అవినీతికి పాల్పడినట్లు ఇటీవల సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్ విచారణకు ఆదేశించారు. ఇప్పటికే వికారాబాద్ డీఎఫ్‌ఓ ప్రాథమిక విచారణ జరపగా, మార్చి 27వ తేదీ ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌ఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వివరాలు సేకరించారు. గురువారం స్టేట్ ఫారెస్ట్ విజిలెన్స్ డీఎఫ్‌ఓ ముకుంద్ రెడ్డి ఆధ్వర్యంలో మరోసారి లోతైనా విచరణ జరిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారులను కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం తాండూరు రేంజ్ కార్యాలయంలో రికార్డులను, బషీరాబాద్ మండలం గొట్టిగా కళాన్ గ్రామంలో అటవీ భూముల్లో జరిగిన తవ్వకాలను పరిశీలించారు. విజిలెన్స్ అధికారులతో తాండూరు రేంజర్ శ్రీదేవి సరస్వతి ఉన్నారు.
కలెక్టరేట్‌లో
కంట్రోల్ రూం ఏర్పాటు
అనంతగిరి: జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నందున కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్‌జైన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా సమస్య ఏర్పడితే 08416–242136, 79950 61192 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.
దరఖాస్తుల స్వీకరణ కేంద్రం ప్రారంభం
కొడంగల్: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో డీఆర్‌డీఓ శ్రీనివాస్ ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గంలోని నిరుద్యోగులు అధిక సంఖ్యలో స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఉషశ్రీ బాలకృష్ణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
బార్ ఏర్పాటుకు
దరఖాస్తు చేసుకోండి
అనంతగిరి: కొడంగల్ పట్టణంలో బార్ ఏర్పా టు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి విజయభాస్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బార్ 2 ఏర్పాటు కోసం దరఖాస్తు చేసే వారు రూ.లక్ష డీడీ తీసి అందజేయాలన్నారు. ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. దరఖాస్తు దారులు చెల్లించే రూ.లక్ష తిరిగి చెల్లించబడదన్నారు. లక్ష రూపాయలను డీడీ లేదా చలాన్ రూపంలో డీపీఈఓ వికారాబాద్ పేరుపై తీయాలన్నారు. దరఖాస్తులు జిల్లా ఎకై ్సజ్ కార్యాలయం తోపాటు ఆన్‌లైన్‌లో కూడా పొందవచ్చన్నారు.ఈ నెల 29వ తేదీ ఉదయం 11గంటలకు కలెక్టర్ సమక్షంలో డ్రా తీసి బార్ కేటాయించడం జరుగుతుందని తెలిపారు.
హక్కుల కోసం ఏకమవుదాం
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు: రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకునేందుకు పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు ఏకం కావాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని పార్టీ మండల అధ్యక్షులు, ముఖ్య నేతలు విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, అబ్దుల్‌రవూఫ్, పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్‌లాల, ప్రభాకర్‌గౌడ్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
అవినీతి జలగలపై విచారణ
అవినీతి జలగలపై విచారణ


