ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఆటో | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఆటో

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

● మహిళ మృతి, యువకుడికి తీవ్ర గాయాలు

బుచ్చినాయుడుకండ్రిగ: ద్విచక్ర వాహనంపై కర్మక్రియులకు వచ్చి తిరిగి వెళుతుండగా కేటీరోడ్డుపై ఆటోను ఢీ కొన్న సంఘటన కాటూరు గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. డక్కిలి మండలం మిట్టవడ్డిపాళెం గ్రామానికి చెందిన ఆశోక్‌ (18) తన తల్లి లక్ష్మమ్మ (30)తో కలసి బుధవారం మండలంలోని తహానగర్‌ గ్రామంలోని బంధువుల కర్మక్రియలకు వచ్చారు. కార్యక్రమం ముగిసిన తరువాత ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి బయలు దేరారు. శ్రీకాళహస్తి వైపు వెళుతుండగా కాటూరు సమీపంలో ఆటో అదుపు తప్పి, అతి వేగంగా ద్విచక్రవాహనాన్ని ఢీ కొంది. దీంతో ద్విచక్ర వాహనంలోని లక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందగా, ఆశోక్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement