రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Apr 28 2026 8:34 AM | Updated on Apr 28 2026 8:34 AM

నాగలాపురం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన మండలంలోని బైటకొడియంబేడు సమీపంలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నారాయణవనం మండలం పాలమంగలం సౌత్‌ ఎస్టీకాలనీకి చెందిన నాగరాజ్‌(25), కృష్ణమరాజు కండ్రిగ చెందిన వినోద్‌(34) ద్విచక్ర వాహనంలో తమ సొంత పనుల నిమిత్తం ఊత్తుకోటైకు బయలుదేరారు. వారు బైటకొడియంబేడు వద్ద ఓ కంటైనర్‌ను ఓవర్‌టైక్‌ చేయబోయి తిరుపతి వైపు వెళుతున్న ఓ ఆల్టో కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహన చోదకులు నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. వినోద్‌కు తీవ్ర గాయాలు కాగా పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా బైక్‌ దగ్ధమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement