దుస్థితికి చేరిన గ్రామీణ రోడ్లు
నాగయ్యగారిపల్లి–చంద్రగిరి మార్గంలోని రెడ్డివారిపల్లి వద్ద రోడ్డు దుస్థితి
పిచ్చినాయుడుపల్లి వద్ద గుంతలమయమైన రోడ్డు
చంద్రగిరి: మండలంలోని గ్రామీణ రోడ్లు గుంతలమయమయ్యాయి. చంద్రగిరి–నాగయ్యగారిపల్లి రోడ్లు దెబ్బతిన్నాయి. చంద్రగిరి–పిచ్చినాయుడుపల్లి మార్గం మరింత దారుణంగా ఉంది. తొండవాడలోని జగనన్న కాలనీలో రోడ్లు వేయకపోవడంతో అక్కడి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. చంద్రగిరి–ఐతేపల్లి మార్గంలోని ఐతేపల్లి గుంతమయమైంది. తొండవాడ–కొత్తశానంబట్ల రోడ్డు పదేళ్లుగా మరమ్మతు చేయలేదు.
దుస్థితికి చేరిన గ్రామీణ రోడ్లు


