పెద్దపాండూరు దారిద్య్రం
వరదయ్యపాళెం: పక్క ఫొటోలో కనిపిస్తున్నది వరదయ్యపాళెం నుంచి పెద్దపాండూరుకు వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డు. సుమారు 9 కిలోమీటర్ల మేరకు దూరం ఉన్న ఈ రోడ్డు పూర్తిగా ఛిద్రమైంది. అడుగడుగున గుంతలు ఏర్పడి ఆ మార్గంలో వెళ్లే వాహనచోదకులను కుదిపేస్తోంది.
జాతీయ రహదారి ఛిద్రమే
పుత్తూరు నుంచి ఊత్తుకోట వరకు ఉన్న తిరుపతి–చైన్నె జాతీయ రహదారి దారుణంగా ఉంది. రోడ్డు పొడవునా గుంతలు ఏర్పడి వాహనదారులు ఆ మార్గంలో వెళ్లేందుకు ముప్పుతిప్పలు పడుతున్నారు.
రూపుకోల్పోయిన చిన్న పాండూరు రోడ్డు
నియోజకవర్గంలోని నాగలాపురం–చిన్న పాండూరు రోడ్డు రూపు కోల్పోయింది. ప్రధానంగా ఈ రోడ్డు 29 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే 17 కిలోమీటర్ల వరకు అసలు ఆర్ అండ్ బీ రోడ్డు పూర్తిగా ధ్వంసమై మట్టి రోడ్డుగా మారిపోయింది. మరో 12 కిలోమీటర్లు రోడ్డు క్వారీ లారీల దాటికి బావులను తలపించేలా గుంతలు ఏర్పడ్డాయి.
పెద్దపాండూరు దారిద్య్రం
పెద్దపాండూరు దారిద్య్రం


