గతుకుల రోడ్లు
దెబ్బతిన్న ఓజిలి మండలం తిరుమలపూడి రోడ్డు
తిరుపతి రూరల్: మండలంలోని ప్రధాన రహదారుల నుంచి గ్రామాలకు వెళ్లే రో డ్లు గతుకులతో దర్శనమిస్తున్నాయి. రెండేళ్లుగా తట్ట మట్టి వేయకుండా వదిలేయడంతో సంక్రాంతికి పట్టణాలు, నగరాల నుంచి వచ్చే వారి ఒళ్లు గుల్ల అవుతోంది. అంతేకాదు ఖరీదైన కార్లు గోతుల్లో పడి షెడ్డుకు చేరాల్సిన పరిస్థితి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే పల్లె రోడ్లను బాగుపరిచామని పచ్చ పత్రికల్లో కలరింగ్ ఇచ్చుకున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రామచంద్రాపురం మండలం సి.రామాపురం నుంచి చంద్రగిరి మండలం శానంబట్ల వరకు దెబ్బతిన్న రహదారికి మోక్షం ఎప్పుడు కలుగుతుందో అర్థం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం టిప్పర్లతో రహదారి విధ్వంసం చేస్తుంటే ఆ మార్గంలో వెళ్లే వాహనచోదకులు, రైతులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. అలాగే పెరుమాళ్లపల్లి పంచాయతీ లక్ష్మీచెరువుకు వెళ్లే రహదారి గోతులుమయం అయ్యింది. రామానుజ పల్లి సర్కిల్ జాతీయ రహదారి నుంచి పైడిపల్లికి వెళ్లే రహదారి పూర్తిగా ఛిద్రమైంది.
గతుకుల రోడ్లు
గతుకుల రోడ్లు
గతుకుల రోడ్లు


