పక్షుల కేంద్రంలో సందర్శకుల సందడి
దొరవారిసత్రం: ెఫ్లమింగో ఫెస్టివల్ సందర్భంగా నేలపట్టు పక్షుల కేంద్రంలో సోమవారం సందర్శకుల సందడి నెలకొంది. పండుగ మూడో రోజు పర్యాటకులు వందల సంఖ్యలో విచ్చేసి విహంగాలను వీక్షించారు. పక్షుల పండుగ ప్రత్యేక అధికారి భానుప్రకాష్‌రెడ్డి పందర్శకులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. నాయుడుపేట సీఐ సంఘమేశ్వరరావు, ఎస్‌ఐ అజయ్‌కుమార్ కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
పక్షుల పండుగ సందర్భంగా పక్షుల కేంద్రం సమీపంలోని పెలికాన్ అతిథి గృహాల వద్ద వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్ధుల నృత్యప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.
పక్షుల కేంద్రంలో సందర్శకుల సందడి


