మళ్లీ సంక్రాంతి వచ్చినా మారని రోడ్ల దుస్థితి
ఈ పండక్కీ రోడ్లు బాగుపడలేదా?
అంటున్న జనం
రోడ్లన్నీ గుంతలయం
గత సంక్రాంతికే రోడ్లు బాగుచేస్తామన్న కూటమి సర్కారు
మళ్లీ సంక్రాంతి వచ్చినా బాగుపడని
రహదారులు
ఊరికొచ్చేవారికి గుంతల రోడ్లు స్వాగతం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మళ్లీ సంక్రాంతి పండగ వచ్చినా రోడ్లు బాగుపడలేదు. పండక్కి పల్లెకు వ చ్చే వారికి గుంతల రోడ్లే స్వాగతం పలుకుతున్నా యి. ఈ పండక్కీ రోడ్లు బాగుపడలేదా? అంటూ ఊరికి వచ్చిన వారు నిట్టూరుస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గ్రామీణ రహదారులు ఛిద్రమై దర్శనమిస్తున్నాయి. పండక్కి పట్టణాల నుంచి పల్లెకు వెళ్లాలంటే జనం భయపడుతున్నా రు. దేశ,విదేశాల్లో ఉండే రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వస్తారని,ఆలోపు రహదారులన్నింటినీ అభివృద్ధి చేయాలని ఆదేశించారు. అయితే మళ్లీ సంక్రాంతి వస్తుండడంతో బాబు ప్రభుత్వం మరోసారి ప్రకటన చేసింది. అయినా బాగుపడకపోవడంతో వారు ఆగ్రహిస్తున్నారు.
దుస్థితిలోనే పల్లె రహదారులు.. ప్రయాణం నరకం
మళ్లీ సంక్రాంతి పండుగ రానే వచ్చింది. రోడ్లపై ఏర్పడిన గుంతలను మాత్రం పూడ్చలేదు. తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సాక్షి పరిశీలనలో అనేక గ్రామీణ రహదారులు దారుణంగా ఉన్నట్లు తేలింది. సంక్రాంతికి సంతోషంగా సొంతూరికి బయలు దేరిన వారికి రోడ్డు బాగుందా? లేదా? అనే విషయం తెలియక తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. స్థానిక సర్పంచ్‌లు రహదారులను బాగు చేద్దామన్నా కూటమి నేతలు నిధులు విడుదల కాకుండా అడ్డుకుంటున్నారు.


