20లోపు ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోండి
తిరుపతి సిటీ: ఇటీవల జరిగిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్) పరీక్షకు హాజరైన జిల్లా విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు అన్ని ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవాలని విద్యాశాఖాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో మెరిట్ విద్యార్థుల జాబితా జిల్లా కార్యాలయానికి అందనున్న నేపథ్యంలో పరీక్ష రాసిన విద్యార్థులు ప్రధానంగా కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఏడో తరగతి మార్కుల జాబితా, హాల్‌టికెట్ జిరాక్స్ తదితర సర్టిఫికెట్లను విద్యార్థులు సిద్ధం చేసుకోవాలని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులు తప్పనిసరిగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సర్టీఫికెట్లను సైతం సమర్పించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు జాతీయ విద్యామంత్రిత్వ శాఖ వైబ్‌సైట్ www.rchoarrh ipr.gov.in లేదా www.bre.ap.gov.in ను సంప్రదించాలని సూచించారు.
తుడా వైస్ చైర్మన్‌గా
గోవిందరావు
తిరుపతి తుడా: తుడా (తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) వైస్ చైర్మన్‌గా ఆర్ గోవిందరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను సోమవారం బదిలీ చేసింది. అమరావతిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్‌లో పనిచేస్తున్న గోవిందరావు తుడా వీసీగా నియమిస్తూ తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. తిరుపతి జేసీగా పనిచేసిన శుభం బన్సల్‌ను గత ఏడాది అక్టోబర్ 10న ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటినుంచి తుడా వీజీగా జాయింట్ కలెక్టర్‌గా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య పూర్తి బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చారు. చాలా కాలం తరువాత ప్రభుత్వం పూర్తిస్థాయి వీసీ నియమించి, జేసీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
పండుగ వేళ ప్రత్యేక రైలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: గూడూరు, విజయవాడ మీదుగా ఈ నెల 18వ తేదీన 07483 నంబర్ ప్రత్యేక రైలు (ఆదివారం) తిరుపతి నుంచి చర్లపల్లి వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా నడుపనున్నారు. ఈ రైలు తిరుపతిలో రాత్రి గంటలకు 9.50కి బయలుదేరి, చర్లపల్లికి ఉదయం 11.45 నిమిషాలకు చేరుకుంటుంది. పండగల రద్దీ దృష్ట్యా రైల్వేశాఖ కల్పించిన ఈ అవకాశాన్ని యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు.
విధి నిర్వహణలో
అప్రమత్తంగా ఉండాలి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఎరచ్రందనం అక్రమరవాణా నిరోధక టాస్క్‌ఫోర్స్ సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ సూచించారు. సోమవారం స్థానిక టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎరచ్రందనం సంపదను పరిరక్షించడంలో టాస్క్‌ఫోర్స్ మంచి ఫలితాలను సాధించిందన్నారు. స్మగ్లర్లు నుంచి సిబ్బందికి ప్రలోభాలు వస్తుంటాయని, అటువంటి వాటికి లొంగకూడదని హెచ్చరించారు. అలాంటి వారు ఉద్యోగాలను పోగొట్టుకుని, వీధిన పడే పరిస్థితి ఉందన్నారు. క్రమశిక్షణతో తమ విధులు నిర్వహించి టాస్క్‌ఫోర్స్‌కు మంచి పేరు తీసుకుని రావాలని ఉద్బోధించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ జె.కులశేఖర్, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, ఎండీ షరీఫ్, ఏసీఎఫ్ శ్రీనివాస్, ఆర్‌ఐ సాయి గిరిధర్, సీఐ ఖాదర్ బాషా, ఎస్‌ఐ సీహెచ్ రఫీ, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
20లోపు ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోండి


