
అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లుగా నియామకం
తిరుపతి సిటీ: ఎస్వీయూలో ఏఏఓలుగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లుగా తిరిగి పదవులు పొందారు. వీరిలో జితేంద్ర నాయక్, మహమ్మద్ రఫీ, కవిత, వెంకటరమణ, విజయ్‌కుమార్, సురేష్ కుమార్, లోకనాథం ఉన్నారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులను ఎస్వీయూ వీసీ, రిజిస్ట్రార్ అభినందించారు.
నేడు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంప్
తిరుపతి ఎడ్యుకేషన్ : బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ ఉద్యోగులకు మెరుగైన సేవలందించాలని సెంట్రల్ జోన్ ప్రిన్సిపల్ సీసీఏ అశోక్‌కుమార్ తెలిపారు. తిరుపతిలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా బీఎస్‌ఎన్‌ఎల్ ప్రధాన కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. బీఎస్‌ఎన్‌ఎల్ సీసీఏ కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగులకు నేడు నిర్వహించనున్న డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపు ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాల ని కోరారు. పెన్షనర్ల సౌకర్యార్థం శుక్రవారం నిర్వహించే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపునకు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జాయింట్ సీసీఏ అంకుర్ కుమా ర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా జీఎం అమరేంద్రరెడ్డి, డెప్యుటీ జీఎం వెంకోబరావు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాసరావు, నాగమహేష్, నీరజ, గురుమూర్తి, ఉద్యోగులు పాల్గొన్నారు.