
నూతన ఆవిష్కరణలకు ఏఎన్‌ఆర్‌ఎఫ్ సహకారం
ఏర్పేడు : శాస్త్ర, సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు ఏఎన్‌ఆర్‌ఎఫ్ (అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్) నిబద్దతతో పనిచేస్తోందని సీఈవో శివకుమార్ కళ్యాణరామన్ అన్నారు. శుక్రవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీని సందర్శించి, సహకార పరిశోధనా కార్యక్రమాలు, ఆవిష్కరణ వ్యూహాలపై అధ్యాపకులతో చర్చించారు. సహకార, అంతర్ విభాగ పరిశోధన ప్రతిపాదనలను పెంపొందించడం, ప్రభావవంతమైన పరిష్కారాల కోసం లోతైన సాంకేతిక పరిశోధన, అభివృద్ధి, ఆర్ అండ్‌డీ వ్యూహాలను గురించి వివరించారు. పరిశోధకుల సామర్థ్య నిర్మాణం, అధునాతన పరిశోధన గ్రాంట్లు, కన్వర్జెషన్స్ హబ్–అండ్–స్పోక్ పరిశోధన నమూనాలు, పీఎం–ఈసీఆర్‌జీ పథకం, మెడ్‌టెక్‌లో సవాళ్లను పరిష్కరించడం వంటి అంశాలపై లోతుగా చర్చించారు. భారతీయ సంస్థలలో పరిశోధనా నైపుణ్యం, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.