
మట్టి అక్రమ రవాణా
● ప్రైవేటు వెంచర్లకు తరలింపు ● ఎమ్మెల్యే అనధికార పీఏ హస్తం
టాస్క్‌ఫోర్స్ : మట్టి మాఫియా కాసులు కురిపిస్తోంది. అధికారం మాటున అక్రమ రవాణా సాగుతోంది. మైనింగ్ , రెవెన్యూ, పోలీసు అధికారుల కళ్లెదుటే పెద్ద సంఖ్యలో వాహనాల్లో మట్టి అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తొట్టంబేడు మండలంలో విరుపాక్షపురం చెరువులో మట్టి తవ్వి ట్రాక్టర్లతో శ్రీకాళహస్తి మండలంలోని పెనుబాకలో ఓ ప్రైవేట్ వెంచరుకు వందల ట్రాక్టర్లు తరలిస్తున్నారు. అధికార పార్టీ అండదండలు ఉండడతో అక్రమ రవాణాను అడ్డుకునే వారే లేకుండా పోయారు. సాక్షాత్తు ఎమ్మెల్యే అనధికారిక పీఏ ఈ అక్రమ రవాణాలో పాత్ర ఉండడంతో అడ్డుకునే ధైర్యం ఎవరూ చేయడం లేదు. చెరువుల నుంచి వందల ట్రాక్టర్లు మట్టి అక్రమంగా తరలిస్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది.
దరఖాస్తుల ఆహ్వానం
తొట్టంబేడు: కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ పరిధిలో పనిచేస్తున్న బీడీ కార్మికుల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాళహస్తి బీడీ కార్మికుల వైద్యాధికారి డాక్టర్ వెంకట భాస్కర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఆగస్టు 31లోపు, ఇంటర్ డిగ్రీ, ఐఐటీ, ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థులు అక్టోబరు 31న నాటికి సంబంధిత వైబ్సెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.