
ఖాళీ బిందెలతో ఆందోళన
రాపూరు: మండలకేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద గిరిజన మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా మహిళలు మాట్లాడుతూ రాపూరు సమీపంలోని ఆంజనేయపురం గిరిజనవాడలో రెండు వారాలు కిందట ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిందని, ఈ విషయమై పలుసార్లు అధికారులకు విన్నవించినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. విద్యుత్ లేకపోవడంతో మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, సుదూరంలోని బోరు వద్దకు వెళ్లి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీంతో ఖాళీ బిందెలతో సబ్‌స్టేషన్‌కు చేరుకుని, ధర్నా చేపట్టామన్నారు. వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పా టు చేస్తామని ట్రాన్స్‌కో ఏఈ కార్తీక్ హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెనుతిరిగారు.
గొడ్డేరు వాగులో మృతదేహం
వెంకటగిరి రూరల్: మండలంలోని చింతగుంట సమీపంలో ఉన్న గొడ్డేరువాగులో వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. ఎస్‌ఐ ఏడు కొండలు కథనం మేరకు.. చింతగుంట వాగు లో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స మాచారం అందింది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించగా పట్టణంలోని మూలసాలివీధికి చెందిన దొంతు మునెయ్య (50)గా గుర్తించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మునెయ్య వాగులోకి దిగి ప్రమాదవశా త్తు మునిగిపోయి మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.