పరిశ్రమల ప్రోత్సాహానికి ప్రాధాన్యత
తిరుపతి అర్బన్: పరిశ్రమల ప్రోత్సాహానికి తొలి ప్రాధాన్యత ఉంటుందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నా రు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాకు చెందిన పండ్ల పరిశ్రమల అసోసియేషన్ నేతలు కట్టమంచి బాబి, శివకుమార్, బాబు, తరుణ్ తమసమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మామిడికి గిట్టుబాటు ధర లు లేకపోవడంపై ఓ వినతిపత్రం అందజేశారు. అ నంతరం సత్యవేడు మండలంలోని దాస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆ ధ్వ ర్యంలో శుక్రవారం నిర్వహించనున్న జాబ్‌మేళా పో స్టర్‌ను ఆవిష్కరించారు. పరిశ్రమలశాఖ జిల్లా అధి కారి సుధాకర్, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి, డీఆర్ డీఏ పీడీ శోభనబాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం, ఉద్యానశాఖ అధికారులు మ ధుసూదన్‌రెడ్డి, దశరథరామిరెడ్డి, పశుసంవర్థకశాఖ అధికారి రవికుమార్ పాల్గొన్నారు.
80 పరిశ్రమలకు ఏపీఐఐసీ భూములు
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని ఆలత్తూరు, బీఎస్‌పురం, కొత్తపాళెం, తొట్టంబేడు మండలంలో ని రౌతుసూరమాలలోని ఏపీఐఐసీకి సంబంధించిన భూములను 80 పరిశ్రమలు ఏర్పాటుకు కేటాయించినట్లు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆయన బుధవారం మండలంలోని ఆలత్తూరు, బీఎస్‌పురం, కొత్తపాళ్లెం గ్రామాలతోపాటు తొట్టంబేడు మండలంలోని రౌతు సూరమాల గ్రామంలోని ఏపీఐఐసీ భూములు, అందుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఏపీఐఐసీకి ఉన్న లింకు రోడ్లును పరిశీలించారు.
శ్రీసిటీని సందర్శించిన మంత్రి కొండపల్లి
శ్రీసిటీ (వరదయ్యపాళెం): మంత్రి కొండపల్లి శ్రీని వాస్ బుధవారం శ్రీసిటీని సందర్శించారు. ఆయనకు సాదర స్వాగతం పలికిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, శ్రీసిటీలో మౌలిక స దుపాయాలు, పారిశ్రామిక ప్రగతిని వివరించారు. అనంతరం ఎంఎస్‌ఎంఈ కేటగిరికి చెందిన నూతన పరిశ్రమ గుప్తా ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ శంకుస్థాపనలో మంత్రి పాల్గొన్నారు. తరువాత శ్రీసిటీ పరిసరాల్లో మంత్రి పర్యటించారు. ఎవర్టన్ టీ పరిశ్రమను సందర్శించారు. ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ సీఈఓ విశ్వ మనోహరన్, సత్యవేడు ఎమ్మెల్యే కె.ఆదిమూలం, ప్రిన్సిపల్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ ఎం.శ్రీనివాస శంకర ప్రసాద్, గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాంనాథ్ వెలమాటి పాల్గొన్నారు.
పరిశ్రమల ప్రోత్సాహానికి ప్రాధాన్యత


