పారదర్శకంగా పోలీసుల బదిలీలు
తిరుపతి క్రైమ్: జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న పలువురు సిబ్బందిని పారదర్శకంగా బదిలీ చేస్తూ ఎస్పీ హర్షవర్ధన్ రాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 393 మంది బదిలీ అయ్యారు. ఇందులో చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చిన ఏఎస్‌ఐలు ముగ్గురు, నెల్లూరు నుంచి వచ్చిన ఏఎస్‌ఐలు ఐదుగురు, తిరుపతి నుంచి 19 మంది ఏఏసీలు ఉన్నారు. అలాగే 100 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 256 మంది పోలీస్ కానిస్టేబుళ్లు బదిలీ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. ఐదేళ్లపాటు ఒకే స్టేషన్‌లో పని చేసిన వారికి మూడు ఆప్షన్లు ఎంచుకునే అవకాశం కల్పించారు. వారి ఎంచుకున్న ఆప్షన్లలో ఒకటిని ఎస్పీ కేటాయించారు. ఆరోగ్యం సరిగా లేని వారికి కోరిన పోలీస్ స్టేషన్‌ను కేటాయించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు వెంకటరావు, రవిమనోహరాచారి, నాగభూషణం, రామకృష్ణ, డీఎస్పీలు పాల్గొన్నారు.
పారదర్శకంగా పోలీసుల బదిలీలు


