కొనసాగుతున్న రూమ్ ఇంటర్వెన్షన్ కోర్స్
తిరుపతి క్రైమ్: తిరుపతి జిల్లా ఎంఆర్‌పల్లి పోలీస్ గ్రౌండ్‌లో ఈనెల 21వ తేదీన ప్రారంభమైన రూ మ్ ఇంటర్వెన్షన్ కోర్స్ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ తరగతులు డీఎస్పీ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో మే నెల 1 తేదీ వరకు 11 రోజులు పాటు జరగనున్నాయి. ఇందులో జిల్లాలోని ఏఆర్ సిబ్బంది, స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులకు కానిస్టేబుల్ స్థాయి నుంచి ఆఫీసర్ స్థాయి అధికారులతో పాటు ప్రతి ఒక్కరికీ ఈ రూమ్ ఇంటర్వెన్షన్ కోర్సు శిక్షణ ఇస్తారు. ఏదైనా ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు స్పెషల్ పార్టీలు వచ్చేంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టాలి.. అక్కడ ఎలాంటి వివరాలు సేకరించి, ఉన్నతాధికారుల కు తెలియజేయాలన్న అంశాలపై వివరించారు. మాక్ డ్రిల్ తరగతులు కూడా నిర్వహించారు.
టెక్నాలజీతో జ్ఞానాన్ని
పెంపొందించుకోవాలి
తిరుపతి సిటీ: టెక్నాలజీని సంస్కృత శాస్త్రాలలో విరివిగా వినియోగంచుకుని విద్యార్థులు జ్ఞానాన్ని పొందాలని వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి సూచించారు. వర్సిటీలో జాతీయ సంస్కృత వర్సిటీ, సీడాక్ సంస్థ సంయుక్తంగా ఏఐ, ఎంఎల్, క్వాంటం కంప్యూటింగ్, ఐకేఎస్‌పై రెండు రోజులు నిర్వహించిన జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ఆయన మాట్లాడుతూ సంస్కృతాన్ని ఆధునిక సమాజానికి అందించాలంటే టెక్నాలజీతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఐఐటీ ప్రొఫెసర్ కృష్ణప్రపూర్ణ, విభాగాధిపతి ప్రొఫెసర్ గణపతి భట్, ప్రొఫెసర్ రమాశ్రీ, డాక్టర్ జానకి, ప్రొఫెసర్ చంద్రశేఖరం, శ్రీధర్, నాగలక్ష్మీ, ప్రసన్న, సంకీర్తి పాల్గొన్నారు.
చైన్ స్నాచర్ అరెస్టు
తిరుపతి క్రైమ్: వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్‌ని అరెస్టు చేసినట్లు వెస్ట్ సీఐ మురళీమోహన్ పేర్కొన్నారు. సీఐ కథనం మేరకు.. తిరుపతి త్యాగరాజునగర్‌లో ఇటీవల ఓ మహి ళ మెడలో గొలుసు చోరీ జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం అలిపి రి రోడ్డులోని వివేకానంద సర్కిల్ బస్ స్టాప్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించగా తిరుపతి రూరల్, శెట్టిపల్లి పంచాయతీ బీటీఆర్ కాలనీలో నివాసముంటున్న పందిపట్ల దేవరాజులుగా గుర్తించారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దేవరాజులు పెయింట్ పని చేస్తూ జీవనం కోసం ఇక్కడికి వచ్చాడు. అతడు చైన్ చోరీకి పాల్పడినట్లు అంగీరించాడని, అతని వద్ద నుంచి 17 గ్రాముల బంగారు చైను, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.


